ఈరోజు చాగలమర్రి 3వ సచివాలయం పరిధిలోని 9వ వార్డు శివాలయం వీధి,ఎస్సీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బిజేంద్రా రెడ్డి (నాని). జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతీ పేద కుటుంబానికి అందుతున్నాయా..లేదా..అని తెలుసుకుంటూ ఏవైనా సమస్యలుంటే పరిష్కరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతీ గడపకు వస్తామని, మీ ప్రతీ సమస్యను తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కారం చూపడమే తమ ధ్యేయమని..గతంలో ఈ విధంగా మీ ఇంటింటి వద్దకు వచ్చి ఇలా దైర్యంగా చేసిన మంచిని చెప్పి, సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం తమదేనని మళ్ళీ మన వైఎస్సార్సీపి ప్రభుత్వాన్నే ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే గంగుల నాని.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ షేఖ్ బాబులాల్ గారు, ఎంపీపీ వీరభద్రుడు, చాగలమర్రి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పత్తి నారాయణ, c.రమణా రెడ్డి(సదాశివ), వైస్ సర్పంచ్ సోహైల్, బోర్ వెల్ రమణ, సచివాలయం కన్వీనర్ మహబూబ్ బాషా, పగిడాల బాబు 3వ వార్డు మెంబర్ చాగలమర్రి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Gangula: ‘గడప గడపకు’లో ఎమ్మెల్యే
మస్యలుంటే పరిష్కరించడానికి గడప గడపకు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES