ముఖ్యమంత్రి జగనన్న పేదల పక్షపాతి అని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బేజెంద్రారెడ్డి తెలిపారు. చాగలమర్రి మండలంలోని శెట్టి వీడు, జ్ఞానాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల నాని చేరుకోగానే గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి, మండల అధ్యక్షుడు వీరభద్రుడు, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి లక్ష్మీదేవిలా ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు . అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వివరాలను ప్రజలకు వివరిస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగనన్న పేదల పక్షపాతి అని ఆయన ప్రజలకు తెలిపారు. ముఖ్యమంత్రి జగనన్న సామాజిక న్యాయం పాటిస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల కులాల ప్రజలకు పార్టీలకు వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు . భారతదేశం మొత్తం మీద ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలుచేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు వందల సంఖ్యలో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కేవలం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి ప్రజలు గుర్తుకు వస్తారని ఆ తర్వాత ప్రజల కష్టాలను ఆ పార్టీ నాయకులు పట్టించుకోరని ఎమ్మెల్యే నాని విమర్శించారు.
తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా జవాబు దారీగా పనిచేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నదన్నారు. అందుకే ప్రజల మధ్యకు ధైర్యంగా వస్తున్నామని ఆయన గర్వంగా చెప్పారు. తెలుగుదేశం నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగనన్న చెబుతున్న విధంగా ప్రజల ఆశీస్సులతో 175కు 175 అసెంబ్లీ స్థానాలను తమ పార్టీ గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన తెలిపారు . జాతిపిత మహాత్మా గాంధీ కన్నకలలను నిజం చేయాలన్న గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు . ఈ వ్యవస్థ వల్ల ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారమవుతున్నాయని ఎమ్మెల్యే గంగుల నాని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు గతంలో లాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒక రూపాయి లంచం ఇవ్వకుండా తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ దౌలా , డిప్యూటీ తహసిల్దారు విజయకుమార్, ఎంఈఓలు అనురాధ, న్యామతుల్లా, ఈ ఓ ఆర్ డి సుదర్శన్ రావు, ఏఈలు ముల్లా షాజహాన్ , షఫీ ఉల్లా, కొండారెడ్డి పంచాయతీ కార్యదర్శి స్వప్న , వెలుగు ఏపీఎం నాగమ్మ, ఏపీవో నిర్మల, శెట్టివీడు గ్రామపంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ ఇంచార్జ్ పెనుగొండ రాధమ్మ , సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి , జిల్లా సేవల అధ్యక్షుడు గణేష్ రెడ్డి, సాగునీటి సంఘ అధ్యక్షుడు శేషు రమేష్ , పెద్దవంగలి సర్పంచ్ బంగారు షరీఫ్ , తోడేండ్లపల్లె సర్పంచ్ గోవిందయ్య , వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు డాబా మనోహర్ రెడ్డి, చిన్న ఓబులేష్, నాగల్లపాడు పెద్ద రాముడు టి ఎన్ మహబూబ్ బాషా, పుల్లన్న, బాల దస్తగిరి, లక్ష్మిరెడ్డి, మల్లారెడ్డి, సాల్మన్, గొడుగునూరు సంజీవ తదితరులు పాల్గొన్నారు.