గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలోని స్థానిక ఎస్సీ కాలనీలో గత నెల 8వ తేదీ ఎండ వేడిమికి పగిలిన నర్సప్ప కొండను తొలగించేందుకు మరో నాలుగు ఐదు రోజుల్లో పనులు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. నరసప్ప కొండను పరిశీలించేందుకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, డిపిఎం నివేదిత, బ్లాస్టింగ్ కంట్రోలింగ్ సిస్టం ఎక్స్పర్ట్ చంద్రశేఖర్ లు స్థానిక మండల తహసిల్దార్ వేణుగోపాల్ తో కలిసి నరసప్ప కొండను మరియు కొండ చుట్టూ ఉన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల గృహాల ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని, ప్రజలకు గృహాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కొండను తొలగించేందుకు అవసరమైన సామాగ్రిని ఉపయోగించి కొండను తొలగిస్తామని అన్నారు. గుంటూరు నుండి వచ్చిన మైనింగ్ శాఖ సిబ్బంది, బ్లాస్టింగ్ కంట్రోలింగ్ సిస్టం సిబ్బంది కొండను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ సిబ్బంది, బ్లాస్టింగ్ కంట్రోలింగ్ సిస్టం సిబ్బంది, స్థానిక అధికారులు, ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Gonegandla: నర్సప్పకొండ తొలగిస్తాం: సబ్ కలెక్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES