ద్రోణి ప్రభావంతో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 38.5మిమీ, మన్యం జిల్లా పాలకొండలో 35.2మిమీ, శ్రీకాకుళం జిల్లా హీరమండలంలో 35.2మిమీ, పాతపట్నంలో 22.7మిమీ. కర్నూలు జిల్లా ఓర్వకల్లు 22మిమీ, విజయనగరం జిల్లా సంతకవిటిలో 20మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడిలో 40.5°C, నంద్యాల జిల్లా గడివేముల, ప్రకాశం పామూరులో 40.4°C, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 40.2°C, కర్నూలు జిల్లా జి.సింగవరంలో 40.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.