Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. విచారణకు ప్రభుత్వం ఆదేశం

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. విచారణకు ప్రభుత్వం ఆదేశం

ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన(Tirupati Stampede incident)పై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసి న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. ఈమేరకు జ్యుడిషియల్ విచారణకు తాజాగా ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad