Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gummanuru: చంద్రబాబు అరెస్ట్ తో ఎన్టీఆర్ శాపం ఫలించింది

Gummanuru: చంద్రబాబు అరెస్ట్ తో ఎన్టీఆర్ శాపం ఫలించింది

ప్రజా ధనాన్ని లూటీ చేసిన పెద్ద అవినీతి ఘనుడు

చంద్రబాబు అరెస్ట్ తో ఎన్టీఆర్ శాపం ఫలించిందని మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయలేదన్నారు. టిడిపి ప్రభుత్వ 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఎన్నో అరాచకాలు చేశడన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముసుగులో సీమెన్స్ కంపెనీతో ఓ ప్రాజెక్ట్‌కి రూ.3,356 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు.ఆ ఒప్పందం ప్రకారం 90 శాతం సీమెన్స్ పెట్టుబడి 10 శాతం ప్రభుత్వం పెట్టబోతున్నట్లు ప్రచారం చేసుకున్నారన్నారు.కానీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు.చంద్రబాబు మాత్రం అధికారులపై ఒత్తిడి తెచ్చి జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లని విడుదల చేయించాడనీ ఆరోపించారు.ఆ తర్వాత ఆ డబ్బుల్ని అయా కంపెనీల ద్వారా చంద్రబాబు అండ్ గ్యాంగ్ జేబుల్లోకి వెళ్లిందనీ ఆరోపణలు చేశారు.ఈ అవినీతిపై విచారణ జరిపిన సీఐడీ సాక్ష్యాధారాలతో బాబుని అరెస్ట్ చేసిందన్నారు .
ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి జరిగింది.కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అన్నారు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్‌, ఐటీ, ఈడీ, సెబీ ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేసిన స్కాం ఇదే అన్నారు. దోచేసిన సొమ్మును విదేశాలకు అక్కడనుంచి తిరిగి దేశంలోకి వచ్చిందన్నారు.చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం వెలుగులోకి వచ్చిందన్నారు.
ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్‌ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩ వేల కోట్ల రూపాయలు సీమెన్స్‌ ఇస్తుందని చెప్పారు.
తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవల్‌మెంట్‌ నుంచి నోట్‌ పెట్టించారు.ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి,ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్‌ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్‌ ఐటెంగా కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయన్నారు.
ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్‌ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధనలకు, రూల్స్‌కు పూర్తిగా విరుద్ధమన్నారు.
జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారన్నారు.
సీమెన్స్‌ నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసిందనీ ప్రశ్నించారు.డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తన నోట్‌ఫైల్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారన్నారు.సీఎం చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్‌ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది.మన అధికారులేకాదు సీమెన్స్‌ సంస్థకూడా ఇంటర్నల్‌ ఎంక్వయిరీ చేసి 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్‌బోస్‌ అనే వ్యక్తి మేనేజ్‌మెంట్‌నుగాని, లీగల్‌టీమ్‌కాని సంప్రదించలేదని సీమెన్స్‌ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు.
ఈ డబ్బు 70కిపైగా షేర్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చిందన్నారు. వాస్తవంగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్‌బ్లోయర్‌ ఈ రకంగా జూన్‌ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి దాన్ని ముందుకు కొనసాగనీయకుండా పక్కనపెట్టేశారన్నారు.
ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయంచేసేశారన్నారు.స్కిల్‌ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్‌పీ/ స్కిల్లర్‌, డిజైన్‌టెక్‌ ఈరెండు కంపెనీలు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా సెన్‌వాట్‌కోసం క్లెయిమ్‌ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News