వేసవికాలం నేపథ్యంలో ఏపీలో ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయకం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ పదో తరగతి జవాబు పత్రాలను సీల్ చేసి బయటకు పంపించేసరికి కాస్త లేట్ అవుతుంది.
ఈ నేపథ్యంలో స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.