భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో(Tirumala) పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతితో పాటు తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా తిరుమల సీవీఎస్‌వో కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. కొండపైకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.
- Advertisement -
మరోవైపు తిరుమలలో వేంకటేశ్వరుడి ఆలయం మీదుగా ఏకంగా ఐదు విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కొండపై ఆలయానికి సమీపంగా తరుచూ విమానాలు వెళుతుండటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని విమానయాన శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.