హైదరాబాద్ లోని BRS పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ BRS పార్టీ అధ్యక్షుడు తోట సమక్షంలో పలు జిల్లాలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి ఏపీ అభివృద్ది ఆమడదూరంలో ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయ స్తితిలో రాష్ట్ర ప్రజానీకముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు బిఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఏపీలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్ట బోతుంధని ఈసందర్బంగా తోట తెలియజేసారు . ఈ రోజు బీఆర్ఎస్ లో విజయ్ (కావలి) ఆధ్వర్యంలో, ప్రశాంత్ (విజయవాడ తూర్పు) వి.విష్ణు (ఉదయగిరి), పి. రమేష్ (కావలి), జి.సూర్యమోహన్ (మైలవరం), ఎం. రాజేష్ (మైలవరం), బి. ఫిన్నీ లేజర్స్ (దర్శి), పి. రామ కృష్ణ( దర్శి), పి.పవన్ (కావలి) జిల్లాలకి చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BRS పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు .
Hyd: ఆంధ్రప్రదేశ్ BRS పార్టీలో చేరికలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES