Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: విలేఖరులపై దాడిని ఖండించిన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు

Bethamcharla: విలేఖరులపై దాడిని ఖండించిన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు

రాప్తాడు సిఎం సభలో ఫోటోగ్రాఫర్ పై దాడి

బేతంచెర్ల పట్టణం పాతబస్ స్టాండ్ సెంటర్లో, బేతంచెర్ల మండల జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ, రాస్తారోకో చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు అధ్యక్షతన సంఘం సీనియర్ నాయకులు అడ్వకెట్ నందిపల్లె నారాయణ, విలేఖరి వి. సుబ్బరాయుడు, జి. వేణుగోపాల్,టీడీపీ మండల కన్వీనర్ ఉన్నం ఎల్లనాగయ్య, రాష్ట్ర ఎస్టి సెల్ కార్యదర్శి రవీంద్రనాయక్, సిపిఐ మండల కార్యదర్శి వై. భార్గవ్, సిపిఎం మండల కార్యదర్శి ఆర్ఈశ్వరయ్యలు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న జరిగిన సిఎం బహిరంగసభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసిపి కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసి గాయపడ్చడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజా సమస్యలను, ప్రజాపాలనను ప్రజలకు, నిరంతరం తెలియజేస్తూ ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్తులపై ఎవరు దాడిచేసినా వారు అజ్ఞానులు అన్నారు. సమాజ సేవే పరమావధిగా పనిచేస్తున్న విలేకర్లపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, వీటిని జ్ఞానులు ఆందరూ ఖండించాలని కోరారు. రాజ్యాంగ విలువలను, చట్టాలను ఆందరూ గౌరవించాలని అన్నారు. ముఖ్యంగా పాలక ప్రభుత్వాలు ఇలాంటి దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా చట్ట ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగ విలువలను కాపాడుతామని, రాగద్వేషాలకు అతీతంగా నా కర్తవ్యాన్ని నెరవేర్చుతామని రాజ్యాంగం సాక్షిగా, దైవసాక్షిగా ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు జర్నలిస్తులపై దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని, ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో విలేఖర్లు వెంకటేశ్వరగౌడ్,లక్ష్మన్న, బండరాముడు, నాగమధు,పి. నాగరాజు, దస్తగిరి, కె సుబ్బరాయుడు, భూపాల్ నాయుడు, హుసేనయ్య టీడీపీ, సిపిఐ, సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News