సమాజానికి మేలు కలిగించి మంచి కోసం ప్రజలను చైతన్యవంతం చేసే న్యూస్ ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని, ఆ దిశగా ‘తెలుగుప్రభ’ మరింత ముందుకు దూసుకు వెళ్ళాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. పల్లె నిద్రలో భాగంగా గోనెగండ్లలో మాజీ ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు రహంతుల్లాలు 2024 సంవత్సరం ‘తెలుగు ప్రభ’ నూతన క్యాలెండర్ ను గోనెగండ్ల మండల తెలుగు ప్రభ రిపోర్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీవీ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాసే ప్రతి అక్షరం సమాజాన్ని మేల్కొల్పాలని సూచించారు.
చదివే ప్రతి ఒక్కరు ఆలోచన చేసే విధంగా వారు కూడా సమాజానికి తమ వంతు సహకారం అందించాలని చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు ఎంతో ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవాన్ని కల్పించారని అలాగే అవసరమైన సహకారాన్ని కూడా అందించారని, ఎప్పటికీ కూడా మీడియాకు తమ వంతు సహకారం ఉంటుందని బీవీ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో గోనెగండ్ల టిడిపి నాయకులు అడ్వకేట్ చంద్ర, అడ్వకేట్ వెంకటేశ్వర్లు, డాక్టర్ తిరుపతయ్య, కులమాల రాముడు, పెద్ద నెలటూర్ నాగన్న, కాంట్రాక్టర్ మదీనా, ఎస్ఎన్ మాబు వలి, రంగస్వామి నాయుడు, భారతం రహంతుల్లా, గాజులదిన్నె చంద్ర, బొగ్గు రమేష్, హోటల్ వలి, ప్రేమరాజు, గోనెగండ్ల రిపోర్టర్స్ బృందం అక్బర్ వలి, విలేఖరి గౌస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.