అంగళ్లులో ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్రకు అఫూర్వ స్వాగతం లభించింది. అంగళ్లులో దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు, హారతులు పట్టారు. మండుటెండలోనూ మేమంతా సిద్ధమంటూ… ముఖ్యమంత్రి వైయస్.బస్సుయాత్రలో పాల్గొన్న మహిళలు. బస్సుపై నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేపురికోటలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మేమంతా సిద్ధం అంటూ హారతులు పడుతూ స్వాగతం పలికారు.






