పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో.. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అర్భన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


