Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Review: విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ ఒప్పందాలు అమలు

Jagan Review: విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ ఒప్పందాలు అమలు

2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43 శాతానికి పెరిగింది

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఒప్పందాలు అమలుపై సీఎం వైయస్‌. జగన్ సమావేశం. విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఒప్పందాలు అమలుపై సీఎం వైయస్‌. జగన్ సమావేశం. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.

- Advertisement -

నాలుగేళ్లలో వృద్ధి బాగుంది :

  • ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వృద్ధిని వివరించిన అధికారులు.
  • స్థిరధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36శాతం, ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని వివరించిన అధికారులు.
  • గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందని వెల్లడించిన అధికారులు.
  • 2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43శాతానికి పెరిగిందని వెల్లడించిన అధికారులు.
  • ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ ఒన్‌ స్థానంలో నిలుస్తున్నామని వెల్లడించిన అధికారులు.
  • 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ 16.22 శాతంగా ఉందని వెల్లడించిన అధికారులు.
  • జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని వెల్లడించిన అధికారులు.
  • 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు.
  • 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపిన అధికారులు.
  • 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు కాగా, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. రూ.1.6లక్షల కోట్లు పెరిగిందని తెలిపిన అధికారులు.

రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి

  • పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర : సీఎం
  • ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి:
  • ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి: సీఎం
  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి.
  • MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలన్న సీఎం.
  • దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించిన సీఎం.
  • పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్‌ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
  • ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలని ఆదేశించిన సీఎం.
  • రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలన్న సీఎం.
  • మరోవైపు నైపుణ్యాలను పెంచడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.
  • ప్రస్తుతం ఉన్నడిగ్రీలకు తోడు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్న సీఎం.

గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ఒప్పందాలు… కార్యరూపంలోకి ప్రతిపాదనలు :

  • పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని వివరాలనూ వెల్లడించిన అధికారులు.
  • ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి… 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామన్న అధికారులు.
  • వీటిద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని వెల్లడి.
  • 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు.
    కాని ఇందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని వెల్లడి.
  • విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడి.
  • ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించిన అధికారులు.
  • రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టనున్నాయని వెల్లడించిన అధికారులు
  • జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపిన అధికారులు.
  • గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీకూడా ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశాలు.

విద్యుత్‌ ప్రాజెక్టులపైనా సమీక్ష:

  • విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించిన అధికారులు.
  • ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని, మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపిన అధికారులు.
  • మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని తెలిపిన అధికారులు.
  • విశాఖ సదస్సు ద్వారా కాకుండా… అంతకు మునుపే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకోగా అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, 11 డీపీఆర్‌ పూర్తిచేసుకున్నాయని వెల్లడించిన అధికారులు.
  • మొత్తం వీటిద్వారా 8.85లక్షల కోట్లు పెట్టిబడులు వస్తుండగా, 1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించిన అధికారులు.

ఐటీకి చిరునామా విశాఖ కావాలి :

  • ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్‌ కావాలని సీఎం అన్నారు.
  • దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
  • దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని సీఎం అన్నారు.
  • ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించిన సీఎం.

ఐటీ ఎంఓయూల్లో గణనీయ ప్రగతి:

  • ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్‌ రంగంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపైనా సీఎంకు వివరాలు అందించిన అధికారులు.
  • ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 88 ఒప్పందాలు చేసుకోగా, వీటి విలువ రూ.44,963 కోట్లని తెలిపిన అధికారులు.
  • ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని వెల్లడించిన అధికారులు.
  • దాదాపుగా రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని వెల్లడి.
  • ఇవికాక ఫుడ్‌ ప్రాససింగ్‌, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైనా సీఎం సమీక్ష చేశారు.
  • ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
  • టమెటా, ఉల్లి లాంటి … డిమాండులో తీవ్ర వ్యత్యాసం తరచుగా వచ్చే పంటల విషయంలో ఈ ప్రాససింగ్‌ యూనిట్లనే నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు.
  • దీనివల్ల రైతులకు తోడ్పాటు ఇచ్చినట్టువుతుందన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News