ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
“శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు.
షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని శ్రీ వైయస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు” అని పేర్కొంది.