Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Kakani: కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

Kakani: కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి(Kakani Govardhan Reddy) వెంకటగిరి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.

- Advertisement -

కాగా క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, గిరిజనులను బెదిరించడం తదితర అభియోగాలపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణి నాలుగో నిందితుడిగా ఉన్నారు. న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ లభించలేకపోవడంతో ఆయన పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి కాకాణి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు ఆదివారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ బందోబస్తు మధ్య వెంకటగిరికి తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad