నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరీ చరిత రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన “ఉద్యోగం – మన హక్కు” అనే నినాదంతో రాయలసీమ గర్జన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నిరుద్యోగులతో, విద్యార్థులతో సమావేశంలో యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వక ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి మోసం చేశాడని, వైసీపీ ప్రభుత్వం నీ గద్దె దింపుతం అని, నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉండాలని గౌరు దంపతులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకర్గo మాజీ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి , నందికొట్కురు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి గౌరు వెంకట రెడ్డి , నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు.
రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ చైర్మన్ శ్రీ రాములు, విద్యార్థి విభాగం నాయకులు అయ్యస్వామి, నాగరాజు, కోనేటి వెంకటేశ్వర్లు, ఎద్దుపెంట అంజి, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ, టీడీపీ నాయకులు పుసులూరు ప్రభాకర్ రెడ్డి, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి, పాలకోలను సుధాకర్ రెడ్డి, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్, మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.