Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: ఓ మహానేత ..చరిత మరువదు నీ ఘనత

Kalluru: ఓ మహానేత ..చరిత మరువదు నీ ఘనత

సంక్షేమ పథకాల ప్రదాత రాజన్న

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 14వ వర్థంతి పురస్కరించుకుని ఆయన సేవలను ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి వైయస్ఆర్‌సిపి కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు, నగర మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద నివాళులు అర్పించిన వారు, అక్కడే కొత్తగా మంజూరైన వైయస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి 34 మంది లబ్దిదారులకు నగదు అందజేశారు. అనంతరం మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో నేటికీ జీవించే ఉన్నారన్నారు. సంక్షేమ పథకాల ప్రదాత వైయస్ఆర్ అని కొనియాడారు. నిలువెత్తు తెలుగుదనం, సంప్రదాయం ఉట్టి పడే పంచెకట్టు, నిత్యం పేదల పక్షాన నిలిచే గుణం వైయస్ఆర్‌కే సాధ్యమన్నారు. 108, ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ రుణాలు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ ఇలా ఎన్నో అందించి ప్రతి ఒక్కరి గుండెలో, ప్రతి ఇంటి లోగిలిలో వైయస్‌ఆర్ చిరస్మరణీయులయ్యారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ గాజుల శ్వేతరెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మిరెడ్డి, మిద్దె చిట్టమ్మ, నారయణరెడ్డి, శానిటేషన్ ఇంస్పెక్టర్ ఆర్.రాజు, నాయకులు కనికే శివరాం స్వామి, కె.అనిల్ కుమార్, రవీంద్రనాథ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, సుధాకర్ రెడ్డి, రామసుబ్బయ్య, తిరుపాలు శ్రీనివాస యాదవ్, లక్ష్మిపతి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News