అవుకు మండలం సింగన పల్లె గ్రామంలో 1 కోటి 23 లక్షల 54 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, అవుకు మండల పరిషత్ అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ రెడ్డి , వైఎస్ఆర్ పార్టీ నాయకులు చల్లా విగ్నేశ్వర్ రెడ్డి, అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యువ నేత కాటసాని ఓబుల్ రెడ్డి ప్రారంభించారు.
గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం 64 మంది మహిళల లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభలు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 98% మేర హామీలను నెరవేర్చిన రాజకీయ నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డని తెలిపారు.
వైయస్సార్ ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. వైయస్సార్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవానికి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించామన్నారు. నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో కేవలం జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలను లబ్ధి పొందారని, నేడు జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవానికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. ప్రజల కోసం కష్టపడే నాయకుడినే మళ్లీ మనం అధికారంలోకి తీసుకురావాలని అప్పుడే ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులుగా కాటసాని రామిరెడ్డిని మరోసారి ఆశీర్వదించి బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
చల్లా విఘ్నేశ్వర రెడ్డి మాట్లాడుతూ… మన ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాల వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను చూసి నేడు దేశంలో ఎన్నో రాష్ట్రాలు అనుసరించే స్థాయికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారన్నారు. మంచి చేసామని నమ్మితేనే మాకు ఓటు వేయాలని కోరారు. టిడిపి అధినేత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటూ తిరుగుతూ ప్రజలను మభ్య పెట్టెందుకు కుట్రలు పడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కరిముల్లా, రెవిన్యూ రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాముడు, వీఆర్వో , కాంట్రాక్టర్ ముద్దయ్య అవుకు బలిజ సంఘం కునుకుంట్ల రామన్న , శింగనపల్లె గ్రామ వైయస్సార్ పార్టీ నాయకుడు పుల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ పరశురాముడు ఎంపీటీసీ జగపతి రాముడు, చంద్ర, బాలస్వామి రెడ్డి, శివ పుల్లారెడ్డి, లోకి రెడ్డి శివరామిరెడ్డి, సద్దల జగదీశ్వర్ రెడ్డి, గుర్రాల సుదర్శన్, చిన్న రాముడు, గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, వాలంటీర్లు , తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.