నియోజకవర్గంలో సంజామల మండలం నొస్సం గ్రామంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్కిరెడ్డీ వెంకట సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి వైయస్సార్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను ప్రజలతోనే నేరుగా తెలుసుకున్నారు. నెల రోజులపాటు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు లబ్దిపొందని లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది చేకూర్చేటట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు అని జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఇంకా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది జరుగుతుంది అని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగిన కూడా మనమంతా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉండాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలంతా ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ సొసైటీ చైర్మన్ గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, బోనం సంతోష్ కుమార్, మల్కిరెడ్డి రఘురామిరెడ్డి, రామకృష్ణా రెడ్డి, శివరామిరెడ్డి, మండల సచివాలయం కన్వీనర్ దారెడ్డి సుధాకర్ రెడ్డి, గ్రామ సచివాలయం కన్వీనర్ బైరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కప్పేట వెంకటేశ్వరరెడ్డి, వైయస్సార్పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.