బనగానపల్లె నియోజకవర్గంలో కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు గ్రామ సచివాలయం పరిధిలోని కల్వటాల గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నందిపేట గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి కల్వటాల గ్రామ వైయస్సార్ పార్టీ నాయకుడు తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల పనితీరును గ్రామ ప్రజలతో స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా అర్హులైన వారికి ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందనట్లయితే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టసుఖాలను ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా స్వయంగా తెలుసుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98% మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా భావించి వాటిని అమలు చేశామన్నారురు. జగనన్న ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టిడిపి పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి మీ వద్దకు వస్తున్నారని అలాంటి వారిని మళ్లీ 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పి మళ్లీ ముఖ్యమంత్రిగా మన వైయస్ జగన్మోహన్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ రెడ్డి, మండల తహశీల్దార్ అల్ఫ్రెడ్, పార్టీ జిల్లా ప్రచార అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి, మండలం వైయస్సార్ పార్టీ కన్వీనర్ అంబటి గురివి రెడ్డి, మండల అధికారులు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు గృహ సారథులు పాల్గొన్నారు.