బనగానపల్లె నియోజకవర్గంలో సంజామల మండలం రామిరెడ్డి పల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అర్హులైన 98 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఇంటి స్థలాల పట్టాలను బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి పంపిణీ చేశారు. గ్రామంలో ముస్లింల శ్మశాన వాటికకు 2 ఎకరాలు, హిందు శ్మశాన వాటికకు 3 ఎకరాలు, ధోభి ఘాట్ కు 80 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడమే కాకుండా వాటికి సంబందించిన పత్రాలను అందచేశారు. అనంతరం 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా గ్రామాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారని అడుగుజాడల్లోనే బనగానపల్లె నియోజకవర్గం లో గ్రామాల్లోని ప్రధాన సమస్యలను తీర్చడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సంజామల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చిన్నబాబు, రామిరెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ సోమ సుందర్ రెడ్డి, పేరు సోముల గ్రామ సర్పంచ్ శృతి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగ కుమార్,మండల తహశీల్దార్ మల్లికార్జున , నడిపెన్న,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.