Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: వైయస్సార్ సంపూర్ణ పోషణ మహిళలకు వరం

Katasani: వైయస్సార్ సంపూర్ణ పోషణ మహిళలకు వరం

బనగానపల్లె పట్టణం పొదుపు భవనం లో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా బాలింతలకు, గర్భవతు లు ఇంటింటింటికి పంపిణీ కార్యక్రమాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బొతుల పాపిరెడ్డి ప్రారంభించారు. అనంతరం గర్భిణులు,బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను లబ్ది దారులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ,జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బొతుల పాపిరెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి అవచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో పరిపాలన విధానం లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భవతులకు, బాలింతలకు పౌష్టకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకం తీసుకువచ్చామన్నారు.

- Advertisement -

అంగన్ వాడి కేంద్రాల ద్వారా ఆయా పరిధిలో ఉంటున్న బాలింత, గర్భిణులకు 15 రోజులకు ఒక సారి 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 3 కేజీ ల రైస్, 3 కేజీ ల కందిపప్పు, అర లీటర్ నూనెలతో పాటు జొన్న పిండి, రాగి పిండి లాంటి పౌష్ఠిక ఆహారం ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామన్నారు. చాలా మంది పుట్టే పిల్లలు రక్త హినతతో బాధ పడుతుంటారు అని అలా కాకుండా పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యం తోనే వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పౌష్ఠికాహారం అందించడం జరుగుతుంది అని చెప్పారు. శిథిలావస్థకు చేరుకొన్న అంగన్వాడీ కేంద్రాలను అధునికరించడం జరుగుతుంది అని అందుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలు శిధిలావస్థలో ఉన్న వాటిని గుర్తించి వాటి జాబితాను తనకు తయారు చేసి ఇవ్వాలని స్త్రీ శిశు సంక్షేమ అధికారులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఎంపీపీ మానస వీణ, మండల అభివృద్ధి అధికారి శివ రామయ్య,బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మారెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News