నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బందు పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు… అనంతరం తిక్కారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలలో మా అధినేత అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రబందు పిలుపు మేరకు బందు చేస్తూండగా నాలుగు మండలాలు నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తరలించడం అప్రజాస్వామికమని ..ఇది తుగ్లక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అధినేత విడుదల అయ్యేంత వరకూ మా పోరాటం ఆగదని, చంద్రబాబుకి వస్తున్న ఆదరణ చూడలేక, వచ్చే ఎన్నికల్లో బాబు సీఎం కావటం ఖాయమనే భయంతో సీఎం జగన్ అక్రమ కేసులు పెడుతున్నారని తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
