Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kothapalli: ఘనంగా మే డే

Kothapalli: ఘనంగా మే డే

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దింపితేనే కార్మిక హక్కులను కాపాడుకోగలమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు సిఐటియు నాయకులు దాసు హరిత అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కొత్తపల్లి మండలంలోని బస్టాండ్ సెంటర్లో సిఐటియు జెండాను ఎన్ స్వాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి సిఐటియు జిల్లా నాయకురాలు హరిత అధ్యక్షత వహించగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు సిఐటియు మండల కార్యదర్శి దాసు రైతు సంఘం నాయకులు జి దాసు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుంది 8 గంటల పని విధానం కోసం చికాగో నగరంలో జరిగిన పోరాటస్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యమత్యమై మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజన కార్మికులను స్కీం వర్కర్లను మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా పోలీసు నిర్బంధాలతో పోరాటాలను అణిచివేస్తుందని ఆరోపించారు. ఇలాంటి కేంద్రాల రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కార్మిక వర్గం చైతన్యవంతంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు శ్రీదేవి నాగమణి లక్ష్మీదేవి వసంత సునీత ఆశా కార్యకర్తలు జయమ్మ రమణమ్మ గ్రామీణ పారిశుద్ధ కార్మికులు స్వాములు హనుమంతు జయన్న రాజారావు సిపిఎం నాయకులు చిన్నచిన్నయ సత్యరాజు, ప్రాతకోట నాగన్న, ధర్మరాజు దేవకుమార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News