Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: రైతులకు రుణాలపై బ్యాంకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

Kurnool: రైతులకు రుణాలపై బ్యాంకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

వ్యవసాయం, ఎమ్ఎస్ఎమ్ఈ లకు సంబంధించిన లోన్లు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను అదేశించారు. జిల్లా పరిషత్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశాన్ని కలెక్టర్ డా.జి.సృజన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా బ్యాంకర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశానికి బ్యాంక్ కో ఆర్డినేటర్ లు హాజరు కాకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు, సమావేశానికి హాజరుకాని కో ఆర్డినేటర్ల పేర్లు, బ్యాంకు పేరుతో సహా వారి యొక్క హెడ్ ఆఫ్ ది బ్యాంక్ దృష్టికి తీసుకొని వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఎల్డిఎమ్ ని అదేశించారు. వ్యవసాయానికి సంబంధించి లోన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ బాధ్యతతో వ్యవహరిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరి కన్న చాలా తక్కువ శాతం ఇస్తున్నారని, వ్యవసాయానికి సంబంధించిన లోన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వ బ్యాంకులు పురోగతి సాధించాలని సంబంధిత బ్యాంకర్లను అదేశించారు. ఎంఎస్ఎమ్ఈ కి సంబంధించి ఇచ్చిన లక్ష్యాన్ని మించి సాధించామని చెప్తున్నారు కాని అందులో ఎంతమంది పాత ఎంఎస్ఎమ్ఈ లకే లోన్లు ఇచ్చారని ఎంతమంది కొత్త వారికి సపోర్ట్ చేస్తూ ఎంఎస్ఎమ్ఈ లు ఏర్పాటు చేయించారనే నివేదికలు గత ఏడాది నుండి ఇప్పటివరకు ఇవ్వాలని ఎల్డిఎమ్ ని అదేశించారు. ఎంఎస్ఎమ్ఈ అప్లికేషన్ శాంక్షన్ చేసే విషయంలో కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పురోగతి సాధించలేదని, ఈ ఆర్థిక సంవత్సరం నుండి అయిన బ్రాంచ్ మేనేజర్ లతో కో ఆర్డినేటర్ సమీక్షలు నిర్వహించి వారికి నెల వారి లక్ష్యాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత బ్యాంక్ అధికారులను ఆదేశించారు. అగ్రికల్చర్ కి సంబంధించిన లోన్లు, ఎంఎస్ఎమ్ఈ లకు సంబంధించిన అప్లికేషన్ శాంక్షన్ చేసే విషయంలో అర్హులైన ఏ ఒక్కరి అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయకుండా చూసుకోవాలన్నారు. వచ్చే సమావేశం నుండి ఫిషరీస్ కి సంబంధించిన లక్ష్యాలను కూడా బ్యాంకుల వారిగా పంపించి ఆ అంశాన్ని కూడా ఇందులో పొందుపరచాలన్నారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వేవర్స్ కి సంబంధించిన ముద్ర లోన్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్మిగనూరులో ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించిన అప్లికేషన్లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్టాండ్ అప్ ఇండియా, పిఎం స్వానిధి కింద లోన్లు మంజూరు అయ్యి ఇంకా డబ్బులు డిస్బర్స్ చేయలేదని, డిస్బర్స్ చేయని బ్యాంకుల వారు త్వరితగతిన డిస్బర్స్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న తోడుకి సంబంధించి బ్యాంకుల వద్ద పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ లు త్వరితగతిన శాంక్షన్ చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు రుణాల మంజూరు లో కూడా కొన్ని బ్యాంకులు వెనుకబడి ఉన్నాయన్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి సాంక్షన్ చేసిన వాటికి లోన్ల డిస్బర్స్మెంట్ త్వరగా మంజూరు చేసేలా చూడాలన్నారు. తదనంతరం కర్నూల్ జిల్లా క్రెడిట్ ప్లాన్ 2023-24 కి సంబంధించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఎల్డిఎం రామచంద్రరావు, ఆర్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రెహ్మాన్, తదితర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News