కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
సమాజంలో మహిళ ఒక తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా, కోడలిగా ఉద్యోగిని గా ఉంటూ అందరికీ అలుపులేకుండా .. సహనంతో చేసే సేవలను సభలో పాల్గొన్నవారంతా గుర్తు చేసుకున్నారు.
ప్రతి ఒక్కరు మహిళలకు గౌరవం ఇస్తూ సమాజంలో వారి విలువలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని సభ అభిప్రాయపడింది. మహిళా విభాగపు డాక్టర్స్ కు డా.హేమనలిని, డా. మాధవి శ్యామల, డా. రాధారాణి, డా. మంజుల బాయ్, డా. చిట్టి నరసమ్మ, డా. రేణుక ఇతర డాక్టర్లకు సన్మానాలు చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేఎంసీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ముఖ్యంగా గ్రామాలలో మహిళలపై వివక్షత చాలా ఎక్కువగా ఉంది వివక్షత లేకుండా మహిళలకు కూడా పురుషులతో సమానం అనే సమానత్వ దోరని సమాజంలో రావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డీఎంఈ & ప్రిన్సిపాల్, డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ CSRMO, డా. హేమనలిని తదితరులు పాల్గొన్నారు.