Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: మే 31 నాటికి 'నాడు-నేడు' పూర్తి కావాలి

Kurnool: మే 31 నాటికి ‘నాడు-నేడు’ పూర్తి కావాలి

మే 31వ తేదీ నాటికి నాడు-నేడు సెకండ్ ఫేజ్ కింద అన్ని పాఠశాలల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి స్కూలు ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖకి సంబంధించి ఆర్టిఈ (12)(1)సి కు సంబంధించి మొదటి విడత మరియు రెండో విడతకి సంబంధించి పాఠశాలలో రిజిస్టర్ చేసుకొని విద్యార్థులు రిజిస్టర్ చేసుకుని సదరు పాఠశాలలో చేరేలా చూడాలని డిఈఓని ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో రెమిడీయల్ క్లాసెస్ జరుగుతున్నాయని అందులో 4,500 మంది విద్యార్థులు హాజరు కావడం లేదని వారిని సచివాలయాల వారిగా ఎంపిడిఓలు, హెడ్ మాస్టర్లు వారిని గుర్తించి రెమిడీయల్ క్లాసెస్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో, డిఈఓని కలెక్టర్ ఆదేశించారు. ఎందుకంటే వారిని ఇప్పుడు గుర్తించి రెమిడీయల్ క్లాసెస్ లో చేర్పించకుంటే వారి ఇంట్లో వాళ్ళు అమ్మాయిలకు అయితే బాల్య వివాహాలు చేస్తారని, అబ్బాయిలకు అయితే లేబర్ పనులకు పంపిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. కన్సిస్టంట్ రిథంకు సంబంధించి ఇంకా 5 టికెట్స్ పెండింగ్ ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాడు నేడుకి సంబంధించి సమీక్షిస్తూ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కి సంబంధించిన సర్వే ఎంతవరకు వచ్చిందని ఎస్ఎస్ఏ పిఓ ని ఆరా తీయగా 95 శాతం సర్వే పూర్తయిందని రేపటి లోపు సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ కి వివరించారు. జగనన్న విద్యా కానుక పంపిణీకి సంబంధించిన కిట్లు సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేసే సమయంలో క్వాలిటీ చెక్ చేసి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాడు నేడు సెకండ్ ఫేజ్ కింద అన్ని పాఠశాలల్లో జరుగుతున్న విద్యుత్, త్రాగు నీరు, పెయింటింగ్, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ తదితర మౌలిక సదుపాయాల పనులను మే 31 వ తేది నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు పర్సంటేజ్ ఆఫ్ కంప్లిషన్ వర్క్ ఏజెన్సీల వారిగా పెట్టాలని వాటి పురోగతి మీద ప్రతి రోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డిఈఓ రంగారెడ్డి, ఎస్ఎస్ఏ పిఓ వేణుగోపాల్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News