Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత

Kurnool: మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత

మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కర్నూలు రేంజ్ డీఐజీ యస్.సెంథిల్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా కర్నూలు దిశా పోలీసుస్టేషన్ ను డీఐజీ సెంథిల్ కుమార్ జిల్లా ఎస్పీ బి.కృష్ణకాంత్ తో కలిసి తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముందుగా పోలీసు గార్డులు, సిబ్బంది డీఐజీకి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ దిశా పోలీసుస్టేషన్ ను బలోపేతం చేయాలని సూచించారు. దిశా పోలీసుస్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలన్నారు. దిశా పోలీసులు సమస్యాత్మక ప్రదేశాలలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులచే సమస్యాత్మక ప్రాంతాలలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోక్సో కేసులు ఏయే ప్రాంతాలలో ఎక్కువగా నమోదవుతున్నాయో అక్కడ గట్టి చర్యలు చేపట్టాలన్నారు. పోలీసుస్టేషన్ ను ఆశ్రయించే బాధితుల సమస్యలు తెలుసుకొని పరిష్కారించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దిశా పోలీసుస్టేషన్ డీఎస్పీ ఐ.సుధాకర్రెడ్డి, సీఐ లక్ష్మయ్య, ఎస్ఐలు కేశవ, సోనక్క పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మూడవ పట్టణ పోలీసుస్టేషన్ తనిఖీ :
కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా కర్నూలు రేంజ్ డీఐజీ యస్.సెంథిల్ కుమార్ తనిఖీ చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణకాంత్ తో కలిసి మూడవ పట్టణ పోలీసుస్టేషను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి, క్రైమ్ రివ్యూ, సీజ్ చేసిన వాహనాలు, పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ నూతన పోలీసుస్ట్రేషన్ నిర్మాణానికి ప్రతిపాదన పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ తబ్రేజ్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ పోలీసుస్టేషన్ తనిఖీ :
కర్నూలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ యన్.సెంథిల్ కుమార్ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ బి. కృష్ణకాంత్ తో కలిసి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్ లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ను ఏర్పాటు
చేయించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లలో బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. ఎండలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ డీఎస్పీ నాగభూషణం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News