కర్నూలు నగర పరిధిలోని దిన్నేదేవరపాడు గ్రామ సమీపంలో జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు హుండీ లెక్కింపును చేపట్టారు. హుండీ లెక్కింపులో 1,66,690 రూపాయలు నగదు రూపంలో హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇంచార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి, హుండీ లెక్కింపు అధికారి జి గుర్రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో జగన్నాథ్ గట్టు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
