Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: జిల్లాలో కొనసాగుతున్న అల్పపీడనం ద్రోణి

Kurnool: జిల్లాలో కొనసాగుతున్న అల్పపీడనం ద్రోణి

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు జిల్లాలో 808 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సిపిఓ అప్పలకొండ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాతంలో తుగ్గలి మండలంలో అత్యధికంగానూ, గోనెగండ్ల మండలంలో అత్యల్పంగాను వర్షపాతాలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 26 మండలాలు ఉండగా గడచిన 24 గంటల్లో జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి తుగ్గలి 62.4, ఆదోని 59.4, గూడూరు 51.2, ఆస్పరి 46.4, కోడుమూరు 44.8, ఓర్వకల్లు 44.2, మద్దికెర 43.4, హాలహర్వి 42.6, క్రిష్ణగిరి 36.2, కౌతాళం 36, కర్నూలు అర్బన్ 35.8, కల్లూరు 35.2, కర్నూలు రూరల్ 34.2, పత్తికొండ 17.2, ఆలూరు 30.4, సి.బెళగల్ 28.2, పెద్దకడబూరు 24, కోసిగి 20.4, చిప్పగిరి 18.6, దేవనకొండ 16.6, వెల్దుర్తి 15.0, మంత్రాలయం 12.6, ఎమ్మిగనూరు 9.8, హోలగుంద 8.4 మి.మీ వర్షపాతాలు నమోదు అయ్యాయి అయితే సెప్టెంబర్ మాసంలో సాధారణ వర్షపాతం 3029.8 మి మీ ఉండగా ఇప్పటివరకు 1343.4 మి మీ వర్షపాతం నమోదు అయ్యింది. గత నెలలో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదవగా ఈ నెలలో మొదట్లోనే అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News