Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: డిఈఓ ఆఫీస్ ను ముట్టడించిన టీచర్లు

Kurnool: డిఈఓ ఆఫీస్ ను ముట్టడించిన టీచర్లు

పాత విధానంలోనే కౌన్సిలింగ్ కోసం..

ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో పాత విధానంలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని కర్నూలులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ముట్టడించారు. జులై ఐదో తేదీన సోషల్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పదోన్నతులు నిర్వహించిన విద్యాశాఖ అధికారులు పదోన్నతుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా జరుగుతున్న పదోన్నతుల్లో చీకటి జీవోను (ఆర్ సి.. ESC02-14028/1/2022-E-VI) తీసుకువచ్చి దాన్ని సాకుగా చూపించి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో విద్యాశాఖ అధికారులు అర్హులైన ఉపాధ్యాయులకు కాకుండా అనర్హులకు ప్రమోషన్లు కల్పిస్తున్నారని యూటీఎఫ్, ఆపాస్, ఎస్ టి యు విద్యా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -

ముందు రోజు నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్ ను రద్దు చేసి అర్హులైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు చేశారు. ఆ సమయంలో డీఈవో అక్కడికి చేరుకోగానే ఉపాధ్యాయులు ఆయన చుట్టుముట్టి నినాదాలు చేశారు. అనంతరం డీఈఓ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ శ్యాముల్ పాల్ కల్పించుకుని ఎస్జిటిలో ఎవరైతే పదోన్నతులు పొందుతున్నారో వారందరికీ న్యాయం చేస్తామని ఎవరికి అన్యాయం జరగదని హామీ ఇవ్వడమే కాకుండా కర్నూలు పట్టణంలోని పాత కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న మున్సిపల్ హైస్కూల్ లో ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పదోన్నతుల ప్రక్రియలో పాల్గొనే వారంతా అక్కడ జరిగే కౌన్సిలింగ్లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ శాఖ నుంచి ఎల్లప్ప, హేమంత్, జయరాజు, నవీన్ పాటి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నుంచి జే వి ఆర్ శెట్టి, జనార్ధన్, శ్రీహరి, ఎస్ టి యు సంఘం నుంచి తిమ్మప్ప, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News