Liquor Prices| ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇప్పటికే పలు కంపెనీల మద్యం బ్రాండ్ల ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో మూడు బ్రాండ్ల మధ్యం ధరలు తగ్గించింది. అలాగే త్వరలోనే మరో రెండు కంపెనీల ధరలు కూడా తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్ రూ.220కి అమ్ముతుండగా.. రూ.190కి తగ్గించింది. ఇక రాయల్ ఛాలెంజ్ గోల్డెన్ విస్కీ ప్రస్తుతం రూ.230 అమ్ముతుండగా రూ.210కి తగ్గించింది. ఇక యాంటిక్విటీ బ్లూ ఫుల్ బాటిల్ మీద రూ.200 తగ్గించింది. దీంతో రూ.1600 ఉన్న ఫుల్ బాటిల్ రూ.1400కే దొరకనుంది.
కాగా గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మద్యం షాపులు తీసివేసి పాత విధానం ప్రకారం లాటరీ ద్వారా ప్రైవేట్ వ్యాపారులకు షాపులు కేటాయించారు. అలాగే నాసిరకం మద్యం బ్రాండ్లు తీసేసి కంపెనీల బ్రాండ్ల మద్యం తీసుకొచ్చారు. ఇక చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ కేవలం రూ.99లకే అందిస్తోంది. ఇప్పుడు మూడు మద్యం బ్రాండ్ల ధరలు తగ్గించడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.