Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Guntur: గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

Guntur: గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. పెదకాకాని రైల్వేస్టేషన్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతులను దానబోయిన మహేశ్‌(22), నండ్రు శైలజ(21)గా గుర్తించారు.

- Advertisement -

గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్‌, కృష్ణా జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజ.. కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా పూర్తిచేసిన మహేశ్‌ హైదరాబాద్‌లోని ఓ మొబైల్‌ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇరువురి ప్రేమ వ్యవహారం కుటుంబసభ్యులకు తెలిసింది. అయితే యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం అభ్యంతరం తెలిపారు. దీంతో కలిసి బతలేకపోతున్నామనే ఆవేదనతో ఇద్దరు దసరా పండుగ రోజు ఇళ్ల నుంచి పారిపోయారు. తాజాగా ఇద్దరు రైల్వే ట్రాక్‌పై విగతజీవులుగా కనిపించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో మృతులకు సంబంధించిన ద్విచక్రవాహనం, లగేజ్ బ్యాగులు లభ్యమయ్యాయి. దీంతో వారి కుటుంబీకులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad