Friday, June 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: శ్రీమఠంలో ఏపీ టూరిస్టు పోలీస్ స్టేషన్

Mantralayam: శ్రీమఠంలో ఏపీ టూరిస్టు పోలీస్ స్టేషన్

శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిస్టు పోలీస్ స్టేషన్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గురువులు శ్రీరాఘవేంద్ర స్వామిని సేవించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు మంత్రాలయంకు తరలిరావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. స్థానిక పోలీసులు సమస్యలపై దృష్టిసారించి వాటి నివారణకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. శ్రీమఠానికి వచ్చే భక్తుల భద్రతకై ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి, స్థానిక పోలీసులకు భారం తగ్గిస్తున్నట్టు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News