Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: కౌతాళంలో చంద్రబాబు ప్రజాగళం ర్యాలీ

Mantralayam: కౌతాళంలో చంద్రబాబు ప్రజాగళం ర్యాలీ

శ్రేణుల్లో ఉత్సాహం

టిడిపి తోనే సామాజిక న్యాయం సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు, ఎల్లప్పుడు పెద్దపీట వేశామని, ఈసారి మంత్రాలయం నియోజకవర్గం లో మార్పు రావాలి అని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘ప్రజా గళం’లో భాగంగా మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కౌతాళంలో పాల్గొన్నారు. మొదటిసారిగా చంద్రబాబు కౌతాళంకు రావడంతో ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -

స్థానిక హైస్కూల్ నుండి ర్యాలీగా కూటమి నాయకులు తరలివచ్చారు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. అందుకే కర్నూలు ఎంపీ స్థానాన్ని కురవలకు, మంత్రాలయం స్థానాన్ని వాల్మీకులకు, ఆలూరు స్థానాన్ని లింగాయతులకు, పత్తికొండ స్థానాన్ని ఈడిగ వర్గానికి, కోడుమూరు స్థానాన్ని మాదిగలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని పాటించామన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంతం పూర్తిగా నిరాదరణకు గురైందన్నారు. 102 ప్రాజెక్టులను రద్దు చేసిన ఘనత జగన్ కే దక్కిందన్నారు.

కర్నూలు జిల్లాలో గుండ్రేవుల, పులికనుమా, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం నిధులను కేటాయిస్తే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. మంత్రాలయం నియోజకవర్గం నుండి మూడుసార్లు గెలిచిన బాల నాగిరెడ్డి అభివృద్ధిని మరిచి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. కనీసం ఈ ప్రాంతంలో తాగు, సాగునీరు ఇవ్వలేని ప్రజా ప్రతినిధుల అవసరమా అంటూ ప్రశ్నించారు.

ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుడిసె కృష్ణమ్మ, మాజీ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ ఉల్లిగయ్య, మంత్రాలయం నియోజకవర్గం నాయకులు చెన్న బసప్ప, అడిగోప్ప గౌడ్, వెంకటపతి రాజు, కొటేష్ గౌడ్, ఆదోని నియోజకవర్గం నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, బిజెపి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.. ఎమ్మిగనూరు డిఎస్పి సీతారామయ్య ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News