Sunday, May 12, 2024
Homeపాలిటిక్స్Ananthapur: టిప్పర్ డ్రైవరే ఎమ్మెల్యే కానున్నారా?

Ananthapur: టిప్పర్ డ్రైవరే ఎమ్మెల్యే కానున్నారా?

బ్యాడ్ టైంలో బండారు శ్రావణి

శింగనమల నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో గత 20 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సింగనమల నియోజవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రజా గళం సభ పేరుతో ఓ బహిరంగ సభను నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు విచ్చేశారు. ఈ సభను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వీరాంజనేయులు ఒక టిప్పర్ డ్రైవర్ అంటూ సంబోధించారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆ వీడియోను వైరల్ చేశారు. సింగనమలలో వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. దీంతో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో బాగా సంచలనం సృష్టించింది.

సింగనమల నియోజవర్గంలో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సింగనమల వైసీపీ అభ్యర్థి జొన్నలగడ పద్మావతి సమీప ప్రత్యర్థి బండారు శ్రావణిపై 46,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఓట్ల మెజార్టీలో రెండో స్థానం జొన్నలగడ పద్మావతికి దక్కింది. సింగనమల నియోజవర్గంలో వైసిపి పార్టీలో వర్గ విభేదాలుంటే ఆ వర్గ విభేదాలను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం అందరూ వైసిపి నేతలు కార్యకర్తలు వీరాంజనేయులు గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

బండారు శ్రావణికి ఈ ఐదేళ్లలో ఎప్పుడు మైనస్ లే

సింగనమల టిడిపి అభ్యర్థి బండారు శ్రావణికి పాజిటివ్ కాకుండా నెగిటివ్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2019లో తొలుత బండారు శ్రావణి సింగనమల టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టిడిపిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే యామిని బాల బండారు శ్రావణికి సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత బండారు శ్రావణి పనితీరు సరిగా లేదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టూ మెన్ కమిటీ వేశారు. టూ మెన్ కమిటీ బండారు శ్రావణికి సహకరించ లేదు. దీంతో బండారు శ్రావణిశ్రీ ఒక సంవత్సరం పాటు హైదరాబాదులోనే నివాసం ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు సంవత్సరాల మాత్రమే సింగనమల నియోజవర్గంలో ఉన్నారని ప్రజలకు అందుబాటులో లేరని, కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించ లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో నాలుగు నెలల క్రితం బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాపురం గ్రామంలో నాగమణి అలియాస్ రాజమ్మకు 3 ఎకరాల 67 సెంట్లు భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సింగనమల టిడిపి అభ్యర్థి తండ్రి కోటి రూపాయలు విలువ చేసే భూమిని ఎలాగైనా లాక్కొని సొమ్ము తీసుకోవాలని అనుకున్నారు. సాకే రాజమ్మను సింగనమల టిడిపి అభ్యర్థి తండ్రి టార్చర్ పెట్టడంతో ఆమె మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బండారు శ్రావణి తండ్రి బుక్కరాయసముద్రం రెడ్డిపల్లి జైలుకు రిమాండ్ కు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే బండారు శ్రావణిశ్రీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిన సమయంలో అనంతపురం నగరంలోని వారి ఇంటి వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ లైన్లు తగిలి ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇంకొక వ్యక్తి తీవ్ర గాయాలు పాలయ్యారు. వారి కుటుంబాలను కూడా పరామర్శించిన దాఖలాలు లేవని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అలాగే ఏడాది క్రితం ఒక ప్రముఖ దినపత్రిక బ్యూరో ఇన్చార్జ్ బండారు శ్రావణిపై వ్యతిరేకంగా వార్తలు రాస్తే బండారు శ్రావణి వర్గీయులు ఆయనపై మీడియాలో విమర్శలు చేయించారు. ఇటీవలే మీటింగ్ అనంతరం తిరిగి వస్తున్న ఒక బ్యూరో ఇన్చార్జిపై ఆమె వర్గీయులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో 323, 427 కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. దీంతో ఆమెకు ప్లస్ పాయింట్ కన్నా, మైనస్ పాయింట్ లే ఎక్కువగా ఉన్నాయని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సింగనమలలో ఇటీవల టూ మెన్ కమిటీ సభ్యులు బండారు శ్రావణిని కలిసినప్పటికీ వారి అనుచర వర్గం మాత్రం సహకరించడం లేదని పలువురు బాహాటంగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News