Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: కౌతాళం టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళి

Mantralayam: కౌతాళం టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళి

మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. దేశంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు కోసం పని చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కౌతాళం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు బాషా, సినిమా, రాజకీయాలు, తదితర రంగాలకు ఎనలేని కృషి చేసిన మహానుభావుడైన ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలంతా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad