Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: రాంపురంలో వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవం

Mantralayam: రాంపురంలో వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవం

మంత్రాలయం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున వెలసిన శ్రీ రామలింగేశ్వరస్వామి మహరథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా రామలింగేశ్వరస్వామికి తెల్లవారుజామున పండితులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, మంగళ హారతి ఇచ్చారు. సాయంత్రం రామలింగేశ్వరస్వామి ప్రతిమను ప్రత్యేక రథంపై ఆశీనులను చేసి, ప్రత్యేక పూజలు చేసి ..భక్తుల హర్షధ్వానాలు మధ్య రథోత్సవం జరిపారు. కోలాటాలు, యువకులు నృత్యాల మధ్య స్వామి రథోత్సవం బ్రహ్మాండంగా సాగింది. రాంపురం రెడ్డి సోదరలైన ఉరవకొండ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డిలు రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad