ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్(Farooq) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి షెహనాజ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర సంతాపం తెలిపారు.
- Advertisement -
“ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి షహనాజ్ గారు పవిత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారు. ఆమెకు జన్నత్‌లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆత్మకు శాంతి కలగాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.” అని ట్వీట్ చేశారు.