Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Gottipati Ravikumar : ప్రజల కోసం సీఎం చంద్రబాబు విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Gottipati Ravikumar : ప్రజల కోసం సీఎం చంద్రబాబు విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Gottipati Ravikumar : ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని, అదే సమయంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించవచ్చని ఆయన చెప్పారు. ఈ విధానం వైద్య విద్య, పరిశోధనలకు కూడా ఊతమిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అనవసరంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ఆయన ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను తమ ప్రభుత్వం ఎప్పటికీ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా, జగన్ అసెంబ్లీకి వస్తే, అన్ని విషయాలు కూలంకషంగా అర్థమయ్యేలా వివరిస్తామని మంత్రి రవికుమార్ వ్యాఖ్యానించారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగానే సీఎంఆర్‌ఎఫ్ ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కూడా ప్రజలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మరిన్ని సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad