Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: రాజీనామాకు సిద్ధం.. జగన్‌కు మంత్రి లోకేష్ సవాల్

Nara Lokesh: రాజీనామాకు సిద్ధం.. జగన్‌కు మంత్రి లోకేష్ సవాల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌(Jagan)కు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం.

బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది.” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad