తిరుపతి(Tirupati)లో అపచారం జరిగింది. నగరంలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. హిందూవులు పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రంలో ఇలా అన్యమత ప్రచారం చేయడంపై భజరంగ్‌దళ్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సాక్షాత్తూ అన్నమయ్య విగ్రహానికే శాంతాక్లాజ్ టోపీ పెట్టడంతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనను మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మం అని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 32 వేల సంకీర్తనలతో ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.