ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుట్టా రేణుకను భారీ మెజారిటీ తో గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉందని ఎమ్మెల్యే కే చెన్నకేశవ రెడ్డి అన్నారు. స్థానిక కుర్ని కళ్యాణ మంటపంలో గోనెగండ్ల మండలం వైసీపీ నాయకులు కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక సమీకరణలో భాగంగా బుట్టా రేణుకకు సీటు ఇచ్చారు. ఆమెను గెలిపించి జగన్ కు బహుమతిగా ఇద్దామన్నారు.
వైసీపీ సమన్వయ కర్త, అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సహకారంతో పోటీ చేస్తున్నా, నన్ను ఆదరించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధిను కొనసాగించడానికి కృషి చేస్తానని అన్నారు. ఎంపీగా ఉన్నపుడు అభివృద్ధికి నిధులు తెచ్చామని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బుట్టా నీలకంటప్ప, బుట్టా ప్రతుల్, నసూరుద్దీన్, బీఅర్ బసిరెడ్డి, బంద నవాజ్, దురబాబు నాయుడు, భాస్కర్ రెడ్డి, కాశీ విశ్వనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.