Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Muharram: లాల్ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Muharram: లాల్ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కుల మతాలకు అతీతంగా జరుపుకునే పీర్ల పండుగ

ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి పీర్ల పండుగ సందర్భంగా చాగలమర్రి పట్టణంలోని లాల్ స్వామి పీర్ల మాకనం, హుస్సేన్ భాచ (అబ్దుల్ రసూల్ స్వామి ) వద్దకు చేరుకుని స్వామి వారిని దర్శించుకొని ఫాతెహాలు సమర్పించారు. ఈ మొహరం పండుగ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి అందరూ సోదర భావంతో కలిసి మొహరం పండుగను చేసుకోవాలని కోరారు. అయనతో పాటు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, షేక్. బాబులాల్, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, రామక్రిష్ణ మెడికల్ స్టోర్ అధినేత తొమ్మండ్రు నాగేంద్ర, బచ్చు బాబు , బచ్చు సుబ్రమణ్యం, రాచమడుగు రమణ గుప్త, గేట్ల మాబు, షేక్. సోయబ్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అబ్దుల్లా, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానూలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News