మండల పరిధిలోని ధర్మపురం గ్రామంలో వైసిపి నియోజకవర్గ యువ నాయకులు బుట్ట ప్రతుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ ప్రజల మేలుకోరి ప్రజలు అండగా నిలిచే జననేత జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని, ప్రజాసంక్షేమ పాలనకు అండగా నిలుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు.
పొరపాటున టీడీపీ వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని, ప్రజలు మళ్ళీ ఇబ్బందులు పడతారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు. 14 ఏళ్ల టీడీపీ పాలనకు ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనకు తేడాను గమనించాలని మనవి చేశారు. 2014 ఎన్నికల్లో పొదుపు సంఘాల మహిళలు, రైతులకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో అధిక సంఖ్యలో మహిళా సంఘాలు డీఫాల్టర్ల జాబితాలోకి వెళ్లాయన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల రుణాలను నాలుగు దశల్లో మాఫీ చేశారన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నవరత్నాల్లో వారిని భాగస్వామ్యులుగా చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కావున రేపు రాబోవు ఎన్నికల్లో వైసిపి కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ల ఫ్యాను గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్, మండల సీనియర్ నాయకులు రామకోటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గం బిసి సెల్ నాయకులు విరుపాక్షిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, సుధాకర్, నరసన్న, రంగస్వామి, హజరత్ , ప్రతాప్ , కాశీం, జయన్న, వెంకటేష్ ,రామలింగ స్వామి, లక్ష్మరి శీను , రాజు, గుర్రాల వెంకటేశ్, శాంతి రాజ్, దావీదు, జయరాజు, కోతి ఈరన్న ,నరసరాజు, యల్లా రెడ్డి, చిన్న రాముడు, తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.