సామాజిక సంస్కర్త, దేశాయ్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గురు రాజ్ దేశాయి ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆదివారం తెలుగు ప్రభ దినపత్రికతో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో దేశాయ్ యూత్ అసోసియేషన్ను స్థాపించానని, ఈ అసోసియేషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాల వారికి, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై పోరాడమే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీసి వాటిని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేశానన్నారు. దివ్యాంగులకు, ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన ప్రజలకు, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంగా ఉంటూ సమాజ సేవకే కృషి చేశామన్నారు. ఇలానే ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటే సమాజంలో జరిగే అవినీతి నిర్మూలనకి, ప్రజా సమస్యల పరిష్కారానికై మరింత కృషి చేయవచ్చని, అందుకే ఈరోజు ఈ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి నిర్ణయించుకున్నానన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో ప్రజలకు అతి చేరువుగా ఉన్న ప్రజా పార్టీ తెలుగుదేశం పార్టీ అని కావున తెలుగుదేశం పార్టీతోనే సామాన్య ప్రజలకు సమన్యాయం జరుగుతుందని, అందుకే సోమవారం తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నానన్నారు. ఈ సందర్భంగా తనతో పాటు దేశాయ్ యూత్ అసోసియేషన్ సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వస్తున్న తమ అభిమానులు వందల సంఖ్యలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నామని వారు తెలియజేశారు.
Nandavaram: టీడీపీలోకి గురురాజ్ దేశాయి
గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో దేశాయ్ యూత్ అసోసియేషన్ను స్థాపించా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES