నందవరం మండల పరిధిలోని నాగులదిన్నె గ్రామం వద్ద తుంగభద్ర నదిపై నిర్మిస్తూన్న వంతెనను మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగభద్ర నదిపై నాగలదిన్నె గ్రామంలో నిర్మించిన వంతెన తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కృషితోనే అంకురార్పణ జరిగిందని, జిల్లాలో శాశ్వత పనులు కోట్ల కుటుంబంతోనే సాధ్యమని మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో తుంగభద్ర నదిపై నిర్మించిన వంతెనను టిడిపి నేతలతో కలిసి సందర్శించి పరిశీలించారు. రెండు రాష్ట్రాల ప్రజలు రాకపోకలకు మార్గం సుగమం కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. తుంగభద్ర నదికి తరచూ వరదలు సంభవిస్తుండడంతో తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… నాగలదిన్నె దగ్గర నదిపై 1992 నవంబర్ 18న బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన ద్వారా అంకురార్పణ చేసి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
2009 లో తుంగభద్ర నదికి సంభవించిన భారీ వరదల వల్ల నాగలదిన్నె వంతెన కొట్టుకుపోవడంతో… తెలంగాణ, రాయలసీమ రెండు ప్రాంతాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగడంతో… తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో … అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకొని రూ.49 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం రూ.42 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. అటు తర్వాత తెలంగాణ వైపు అప్రోచ్ రోడ్డు పనులు నిమిత్తం రైతుల నుండి భూ సేకరణ సమస్య ఉండడంతో… అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం ద్వారా రైతులకు భూ నష్టపరిహారం ఇప్పించి పరిష్కరించడంతో రెండు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు మార్గం సుగమం అయ్యిందని ఇందుకు కృషిచేసిన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకి కర్నూలు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కె. పార్థసారథి రెడ్డి, టిడిపి నాయకులు ఆరవీటీ సుధాకర్ శెట్టి, గోనెగండ్ల మాజీ ఎంపీపీ కె.వి.కృష్ణా రెడ్డి, పెద్దనేలటూరు పరమేశ్వర రెడ్డి, బనవాసి ఆదినారాయణ రెడ్డి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, అడ్వకేట్ కేటి మల్లికార్జున, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మచాని శివ కుమార్, వెంకటేశ్వర రెడ్డి, బూదూరు రాఘవేంద్ర రెడ్డి, నందవరం మండలం నాయకులు ముగతి వీరారెడ్డి, సోమల గూడూరు కమలనాభ రెడ్డి, జోహారాపురం సంజీవరెడ్డి, గంగవరం విరుపాక్షి రెడ్డి, రాయచోటి సుధాకర్ రెడ్డి, మారెప్ప, నాగలదిన్నె సత్యన్న, కనకవీడు పెద్ద ఈరన్న, గోనెగండ్ల మండల నాయకులు అగ్రహారం పార్వతమ్మ, మాజీ సర్పంచులు బోయ రంగముని, సి.ఈరన్న, మాజీ ఎంపీటీసీ వెంకట రాముడు తదితరులు కోట్ల వెంట ఉన్నారు.