Tuesday, October 1, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: చంద్రబాబును వెంటనే రిలీజ్ చేయాలని టిడిపి నేతల డిమాండ్

Nandikotkuru: చంద్రబాబును వెంటనే రిలీజ్ చేయాలని టిడిపి నేతల డిమాండ్

ముందస్తు అరెస్టులతో స్టేషన్లో టిడిపి నాయకులు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి కోర్టు తీర్పు రిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర టిడిపి పార్టీ బంద్ పిలుపుమేరకు ఎలాంటి ఆలోచనయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీస్ సిఐ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు జయ సూర్య, ఖాతా రమేష్ రెడ్డి, షకీల్ అహ్మద్, లాయర్ జాకీర్ హుస్సేన్, ముర్తు జావలి,సురేంద్ర,పాణ్యం వేణు, నిమ్మకాయల రాజు, కళాకర్, బుల్లెద్దుల రాజన్న తదితరులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు.

- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ నేపథ్యంలో టిడిపి పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతున్న పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పట్టణ ఎస్ఐ ఎన్వి రమణ, బ్రాహ్కొట్కూరు ఎస్ఐ ఓబులేష్ తమ సిబ్బందితో వాహన రాకపోకలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో వాహన రాకపోకలు, వ్యాపార సముదాయాలు కొనసాగాయి. ఎక్కడ టిడిపి నాయకులు రోడ్డు ఎక్కిన నిరసనలు తెలిపిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అరెస్ట్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసుల కంటపడకుండా నియోజవర్గ టిడిపి నాయకులు అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి నంద్యాల సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని మహనీయునికి పూలమాలవేసి రాజారెడ్డి రాజ్యాంగం నశించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి నినాదాలు చేశారు.

చంద్రబాబు నాయుడు వెంటనే రిలీజ్ చేయాలని అంబేద్కర్ సెంటర్ సర్కిల్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని వారు ఖండించారు. నిరసన స్థలానికి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఎస్సై ఓబులేష్ తన సిబ్బందితో టీడీపీ నాయకులు కాకరవాడ చిన్న వెంకటస్వామి, సంపత్ లను అదుపులోకి తీసుకొని తరలించారు.

ఈ సందర్భంగా టిడిపి నాయకులకు, పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో నాయకులు తమ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను ముక్తకంఠంతో ఖండించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News