Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: 14వ రోజుకు టిడిపి సామూహిక దీక్షలు

Nandikotkuru: 14వ రోజుకు టిడిపి సామూహిక దీక్షలు

బాబు నిర్దోషిగా బయటకు వస్తాడు

టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలు 14 రోజుకు చేరుకున్నాయి. సామూహిక నిరాహార దీక్షలో మిడుతూరు మండలానికి చెందిన టిడిపి నాయకులు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. దీక్షా శిబిరాన్ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మండ్రా శివానందరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిత్త జయ సూర్య, పట్టణ టిడిపి నాయకులు ఎస్ఎండి జమీల్, రాష్ట్రా ముస్లిం మైనార్టీ నాయకులు షకీల్ అహ్మద్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు లాయర్ జాకీర్ హుస్సేన్, క్లస్టర్ ఇంచార్జ్ ముర్తుజవాలి సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

- Advertisement -

దీక్షా శిబిరంలో నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మండ్రా శివానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని, నిస్వార్థ ప్రజా సేవ చేసిన చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు తగవని వారు హెచ్చరించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులపై సుప్రీంకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని త్వరలోనే నిర్దోషిగా చంద్రబాబు బయటకు వస్తాడని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శివరామిరెడ్డి, పల్లె రఘురామిరెడ్డి,జనార్దన్ రెడ్డి , మాణిక్య రాజు, బిసి నియోజవర్గ అధ్యక్షులు వేణుగోపాల్, మనోహర్ రెడ్డి, లాయర్ నాగముని, రసూల్ ఖాన్, వార్డు ఇంచార్జ్ కళాకర్, గని బాషా,ఎస్సీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల రాజన్న, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ప్రభు కుమార్,పగిడ్యాల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పగడం సోమశేఖర్, టిడిపి కార్యకర్తలు సంపంగి, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News